Velpula Venkatesh: పార్టీ నేతల నిర్లక్ష్యంపై వెంకటేశ్ అసంతృప్తి 6 d ago

ఐటీడీపీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ‘లోకేశ్ అన్నా నా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రార్థిస్తున్నా. పార్టీని నమ్మి చాలా నష్టపోయాను. చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషమే తప్ప ఇంకేం లేదు. ఇవన్నీ భరించలేక సెలవు తీసుకుంటున్నా' అని తన సెల్ఫీ వీడియోలో లోకేశ్ తన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రార్థించారు. అయితే వెంకటేశ్ ఇటీవల రాయితీ రుణానికి దరఖాస్తు చేసుకోగా, పార్టీ నాయకుల సహకారం లేకపోవడంతో స్నేహితుల వద్ద వాపోయారు.
ఆయన ఆత్మహత్య ప్రయత్నాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంకటేశ్‌ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. పార్టీ కార్యకర్తలు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, వెంకటేశ్ చికిత్సకు అయ్యే ఖర్చును ఐటీడీపీ భరిస్తుందని తెలిపారు. ఆయన కుటుంబ సంక్షేమం తన బాధ్యత అని ఎక్స్ ద్వారా తెలిపారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహనరాజు, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ఆసుపత్రిని సందర్శించి, వెంకటేశ్ కుటుంబానికి రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. వెంకటేశ్ ఆత్మహత్యాయత్నం ఘటనపై పార్టీలో కలకలం రేగింది. లోకేశ్ పార్టీ కార్యకర్తల సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.